Telugu Movie News | Latest Telugu Cinema News | Tollywood Film News | Tollywood News | All Cinema News | Cinerangam.com

విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఎన్టీఆర్‌’. క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ కథానాయకుడు. ఎన్టీఆర్ తనయుడుగా నందమూరి బాలకృష్ణ అందరికీ తెలుసు. మరి ఎన్టీఆర్‌గా ఎలా ఉంటారో అని ఇన్నాళ్లు ప్రేక్షకుల ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. కాగా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ గెటప్ లో బాలకృష్ణ ఉన్న లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది.

కాషాయ రంగు దుస్తుల్లో ఎన్టీఆర్‌లానే మైక్‌ ముందు నిల్చుని మాట్లాడుతూ కనిపించారు. ఆయన వెనుక త్రివర్ణ జెండా ఉంది. బాలయ్య లుక్ అచ్చం ఎన్టీఆర్ లాగే ఉండటం విశేషం. ముఖ్యంగా బాలయ్య ఎన్టీఆర్‌లా హ్యాండ్ పైకి చూపిస్తూ ముఖంలో చిరునవ్వుతో ఎన్టీఆర్ ను గుర్తుకు తెచ్చారు. ఈ ప్రచార చిత్రం ప్రస్తుతం సోషల్‌మీడియాలో అభిమానుల్ని ఆకట్టుకుంటోంది.

ఎన్టీఆర్‌’ సినిమాలో పలువురు అగ్ర తారలు అతిథి పాత్రల్లో సందడి చేయనున్నారు. జూనియర్‌ ఎన్టీఆర్‌గా మోక్షజ్ఞ, నారా భువనేశ్వరిగా మంజిమా మోహన్‌, సావిత్రిగా కీర్తి సురేశ్‌, శ్రీదేవిగా రకుల్‌ప్రీత్‌ సింగ్‌, రామానాయుడుగా వెంకటేశ్‌, కృష్ణగా మహేశ్‌బాబు.. ఇలా వివిధ పాత్రల్లో పలువురు నటులు సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

యన్‌.బి.కె. ఫిలింస్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమాను వారాహి చలన చిత్రం, విబ్రి మీడియా సమర్పిస్తున్నాయి. ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రంలో బసవతారకం పాత్రలో విద్యాబాలన్‌, నారా చంద్రబాబు నాయుడు పాత్రలో రానా నటిస్తున్నారు. సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: