Screen Writing | Screenplay Writing | Script Writing | Movie Analysis | Script Analyis | Screen Writing Articles by Sikander | Art of Screen Writing | Screenplay Tips by Sikander | Telugu Movie News | Latest Telugu Cinema News | Tollywood Film News | Tollywood News | All Cinema News | Cinerangam.com
ఎందుకంటే.. * మన బామ్మలు కూడా మనకి కథ చెప్పే విధం ఒక స్ట్రక్చర్ లోనే వుంటుండేది గనుక... * శతాబ్దాలుగా స్ట్రక్చర్ అనేది ప్రపంచంలో ఏ దేశంలోనై నా ఒకే పోలికతో వుంటుంది గనుక... * ఆదిమ కాలం నుంచీ కథలు చెప్పుకోవడం స్ట్రక్చర్ ప్రకారమే జరిగింది గనుక... * కథా నాయకుడు కథలో ఎప్పుడు ప్రవేశించాలి, కథ ఎప్పుడు మలుపు తిరగాలి, ఎక్కడ ముగింపు నివ్వాలి అన్నవి, మౌఖికంగా కథలు చెప్పుకునే లిపిలేని కాలం నుంచీ సెట్ అయి వుంది గనుక... * శాస్త్రజ్ఞుల ప్రకారం మనిషి మెదడు కథ చెప్పే తీరుకి, దాన్ని రిసీవ్ చేసుకునే పద్దతికీ మార్పు లేకుండా అనువంశికంగా ట్యూన్ అయి వుంది గనుక!

స్ట్రక్చర్ అంటే.. అనువంశికంగా సబ్ కాన్షస్ మైండ్ లో రూపుదిద్దుకున్న శాశ్వత నిర్మాణం.
క్రియేటివిటీ అంటే.. ఆ నిర్మాణం మీద కాన్షస్ మైండ్ కి నచ్చేట్టు సొంతంగా కథనానికి చెక్కుకునే శిల్పం.

స్ట్రక్చర్ సార్వజనీనం, క్రియేటివిటీ వ్యక్తిగత అభిరుచి.  కథా నిర్మాణం (స్ట్రక్చర్) ఎక్కడైనా ఒకేలా వుంటుంది, ఆ కథ చెప్పే తీరు ( క్రియేటివిటీ) కథకుడు కథకుడికీ మారుతుంది. అందుకే స్ట్రక్చర్ కి రూల్స్ ఏర్పడ్డాయి, క్రియేటివిటీకి సాధ్యం కాదు. ఈ తేడా తెలీక స్క్రీన్ ప్లే కి రూల్స్ ఏమిటోయ్ అని అడ్డం తిరుగుతుంటారు. వాళ్ళ ఉద్దేశంలో క్రియేటివిటీ కి రూల్స్ ఏమిటని!

అవును- నిజంగానే క్రియేటివిటీకి రూల్స్ లేవు. అందుకే నా కథ నా ఇష్టం అన్నట్టుగా రాసుకుంటారు. ప్రకృతి ప్రకారం ప్రేక్షకుల మైండ్ రిసీవ్ చేసుకునేది స్ట్రక్చర్ పరంగానే తప్ప, క్రియేటివిటీ పరంగా కాదని తెలుసుకోక- స్ట్రక్చర్ కీ, క్రియేటివిటీ కీ తేడా తెలీక... స్ట్రక్చర్ ని విస్మరించి క్రియేటివ్ గానే స్క్రిప్టు రాసుకోవడం వల్ల- పునాదుల్లేని భవనానికి నగిషీలు చెక్కుకున్నట్టు వుంటోంది. స్ట్రక్చర్ లేక ఎంత క్రియేటివిటీని రంగరించినా.. సినిమా కథల్ని ప్రేక్షకుల మెదళ్ళు రిసీవ్ చేసుకునే పద్ధతిలో రిసీవ్ చేసుకో లేకపోతున్నాయి. అప్పుడవి అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి.

ఇందుకే స్ట్రక్చర్ అవసరం!

స్ట్రక్చర్ అనే వాస్తవాన్ని గుర్తించడం అవసరం. సినిమా ఆఫీసుకి వాస్తు ఎలాగో, కథకి స్ట్రక్చర్ అలా. ఆఫీసుకి వాస్తు చూసుకుని, ఆ ఆఫీసు పెట్టడానికి మూలకారణమైన కథకి వాస్తు (స్ట్రక్చర్) ఉందా లేదా ఆలోచించక పోవడం అవివేకం.

ఇంతకీ స్ట్రక్చర్ ఎలా వుంటుంది?

ఇది నేర్చుకుందాం. స్ట్రక్చర్ అనే త్రీ యాక్ట్స్ విభాగాల్లో అసలేమేం జరుగుతాయో వివరంగా తెలుసుకుందాం. ఇందుకు సింపుల్ గా ‘శివ’ అనే సినిమాని తీసుకుని చెప్పుకుందాం.

―సికిందర్
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: