Tamil Movie News | Latest Tamil Cinema News | Kollywood Film News | Kollywood News | All Cinema News | Cinerangam.com

ర్య నటిస్తున్న 'గజినీకాంత్' చిత్రం అన్ని హంగులను పూర్తి చేసుకుని ఈ నెల 27న విడుదల కానుంది. కామెడీ నేపథ్యంలో రూపొందించిన ఈ చిత్రాన్ని దర్శకుడు సంతోష్‌ పి.జయకుమార్‌.. ఆర్య అభిమానుల అంచనాలకు తగ్గట్లు చిత్రీకరించారు. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ వీరాభిమాని అయిన ఓ వ్యక్తి మతిమరుపుతో పడే ఇబ్బందులు తెరపై హాస్యపు జల్లులు కురిపించనున్నాయి. ఇప్పటికే సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ‘యు’ ధ్రువీకరణ పత్రం లభించింది.

ఇటీవల విడుదల చేసిన టీజర్‌తో సామాజిక మాధ్యమాల్లో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో ఆర్యకు జంటగా సాయేషా నటించింది. నరేన్‌, సంపత్‌రాజ్‌, కరుణాకరన్‌, బాల మురళీ బాబు తదితరులు ప్రధాన పాత్ర పోషించారు. అన్నట్టు.. ఈ చిత్రం తెలుగులో హీరో నాని నటించి సూపర్‌హిట్ అయిన 'భలే..భలే..మగాడివోయ్' సినిమాకు రీమేక్ అని సమాచారం.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: