ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్‌‌’‌ సినిమాలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ హాలీవుడ్ నటుడు బెనడిక్ట్‌ కంబర్‌బ్యాచ్‌ త్వరలో రాబోతున్న ‘అవెంజర్స్‌ 4’ సినిమాలోనూ నటిస్తున్నారు. డాక్టర్‌ స్ట్రేంజ్‌ బెనడిక్ట్‌గా సుపరిచితమైన ఆయన ఇందులోనూ అదే పాత్రలో కన్పించబోతున్నారు. ఈ విషయాన్ని ఆయన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘అవెంజర్స్‌’ సిరీస్‌లో వస్తున్న సినిమాలో తాను రెండోసారి డాక్టర్‌ స్ట్రేంజ్‌గా కన్పించబోతున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ సినిమా స్క్రిప్ట్‌ను తొలిసారి చదివినప్పుడే ఎంతో థ్రిల్లయ్యానని తెలిపారు.

అవెంజర్స్’ సిరీస్‌లో వస్తున్న నాలుగో చిత్రానికి ‘అవెంజర్స్‌: ఎండ్‌ గేమ్’ అనే టైటిల్‌ను పెట్టాలనుకున్నారు. ఈ టైటిల్ ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతుండడంతో మార్పులు చేసి ‘అవెంజర్స్‌ 4’ను వర్కింగ్‌ టైటిల్‌గా పెట్టినట్లు సినిమాటోగ్రాఫర్‌ ట్రెంట్‌ ఒపాలోచ్‌ తెలిపారు. ఈ ఏడాది చివర్లో టైటిల్‌ను ప్రకటిస్తామని దర్శకుడు కెవిన్‌ ఫీజ్‌ వెల్లడించారు. సినిమా టైటిల్‌ ‘కెప్టెన్‌ మార్వెల్‌’ టైటిల్‌ను పోలినట్లు ఉంటుందని పేర్కొన్నారు. ‘అవెంజర్స్‌ 4’ చిత్రం 2019 మేలో విడుదల కాబోతోంది.

కాగా.. 2016లో ప్రముఖ నిర్మాణ సంస్థ మార్వెల్‌ స్టూడియోస్‌ ‘డాక్టర్‌ స్ట్రేంజ్‌’ చిత్రాన్ని తెరకెక్కించింది. త్వరలో ఈ సినిమాకు సీక్వెల్‌ రాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. అయితే ఎప్పుడు ప్రారంభిస్తామన్న విషయాన్ని మాత్రం ఇప్పుడే చెప్పలేమని తెలిపింది.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: