మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కల్యాణ్ దేవ్ ‘విజేత’ చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమాకే మామయ్య నటించిన సినిమా టైటిల్ పెట్టుకోవడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్‌కు విశేష స్పందన లభించింది. అయితే తన తొలి చిత్రం విడుదలకు ముందే కల్యాణ్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. తన రెండో సినిమాకు ‘వరప్రసాద్ గారి అల్లుడు’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు వదంతులు వినిపిస్తున్నాయి. చిరు అసలు పేరు శివశంకర్ వరప్రసాద్ అన్న విషయం తెలిసిందే. దాంతో ఆ పేరుతోనే టైటిల్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం స్క్రిప్ట్ సిద్ధం అవుతోందట. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించనున్నట్లు సమాచారం.
మరోపక్క ‘విజేత’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. రాకేశ్ శశి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మాళవికా నాయర్ కథానాయిక. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. ‘బాహుబలి’ చిత్రానికి కెమెరామెన్‌గా పనిచేసిన కేకే సెంథిల్ కుమార్ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. త్వరలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
Post A Comment: