విజయ్‌, ఏఆర్‌ మురుగదాస్‌ కాంబినేషన్‌లో ‘తుపాక్కి’, ‘కత్తి’ చిత్రాల తర్వాత మూడో చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో విజయ్‌ సరసన కీర్తిసురేష్‌ నటిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌ గురించి పలురకాల పేర్లు వినిపించాయి. అయితే గురువారం సాయంత్రం టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు. సన్‌ పిక్చర్స్‌ బ్యానరుపై తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘సర్కార్‌’ అని పేరుపెట్టారు. శుక్రవారం విజయ్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ టైటిల్‌ను మరియు ఫస్ట్‌లుక్‌ను ఆవిష్కరించారు. రాజకీయ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. రాజకీయ నేత కళ.కరుప్పయ్య, రాధారవి ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. దీపావళి కానుకగా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: