సీనియర్ సినీనటుడు వంకాయల సత్యనారాయణ (78) కన్నుమూశారు. శ్వాస సంబంధిత సమస్యతో కొంత కాలంగా బాధపడుతున్న ఆయన సోమవారం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వంకాయల సత్యనారాయణ అనేక చిత్రాల్లో క్యారెక్టర్ నటుడిగా తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. పలు సీరియల్స్‌లోనూ నటించారు. తెలుగుతోపాటు తమిళం, మూడు హిందీ చిత్రాల్లో నటించారు. ‘సీతామాలక్ష్మి’, ‘సూత్రధారులు’, ‘అత్తవారిల్లు’, ‘శ్రీనివాస కల్యాణం’, ‘ఊరికిచ్చిన మాట’, ‘శుభలేఖ’, ‘శృతిలయలు’, ‘విజేత’.. ఇలా దాదాపు 180 చిత్రాల్లో నటించారు.
గత ఏడాది విడుదలైన ‘కారందోశ’ సినిమా ఆయన ఆఖరి చిత్రం. నటనతోపాటు ‘వంకాయల జ్యూయలర్స్’ పేరుతో వైజాగ్‌లో ఆయన ఓ నగల షాపును కూడా నడుపుతున్నారు. సత్యనారాయణ 1940లో విశాఖపట్నంలోని చవల వారి వీధిలో జన్మించారు.
Post A Comment: