రామ్‌చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘రంగస్థలం 1985’. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రామ్‌చరణ్‌కి జోడీగా సమంత నటిస్తున్నారు. అయితే ఈ సినిమా 1981లో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఊరుకిచ్చిన మాట’ చిత్రం తరహాలోనే ఉండబోతోందని టాలీవుడ్ వర్గాల సమాచారం. ‘ఊరుకిచ్చిన మాట’ చిత్రంలో చిరంజీవి, మాధవి నటించారు. ఎం.బాలయ్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అప్పట్లో ఈ చిత్రంబాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకుంది. చిరు చిత్రంలోని కొన్ని సన్నివేశాలను స్ఫూర్తిగా తీసుకుని సుకుమార్ ‘రంగస్థలం’ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.
‘రంగస్థలం’ చిత్రంలోని రామ్‌చరణ్, సమంత లుక్‌ను చిత్రబృందం ఇటీవల విడుదల చేసింది. ఇందులో చరణ్ చిట్టిబాబు పాత్రలో, సమంత మహాలక్ష్మి పాత్రలో నటిస్తున్నారు. పూజా హెగ్దే ప్రత్యేక గీతంలో మెరవబోతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సంక్రాంతి సందర్భంగా జనవరిలో సినిమాను విడుదల చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల సినిమాను మార్చికి వాయిదా వేశారు. ఈ సినిమా తర్వాత చరణ్.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తారు. ఆ తర్వాత ఎస్.ఎస్ రాజమౌళి తీయబోయే మల్టీస్టారర్‌లోనూ నటిస్తారు.
Post A Comment: