కథానాయిక రిచా గంగోపాధ్యాయ్ రహస్యంగా పెళ్లి చేసుకున్నారని వార్తలు వెలువడ్డాయి. అయితే ఈ వార్తల్ని రిచా ఖండించారు. తనకు పెళ్లి కాలేదని, ఇప్పట్లో చేసుకోనని స్పష్టం చేశారు. పెళ్లి చేసుకునేటప్పుడు ఆ వార్తను తనే నేరుగా చెబుతానని అన్నారు. ఇలాంటి వదంతులను సృష్టించొద్దని కోరారు. నటనకు స్వస్తి పలికానని రిచా ఇటీవల ప్రకటించారు. ‘ఎవరైతే నా తర్వాతి సినిమా ఏంటని అడుగుతున్నారో వారందరికీ నేనిచ్చే సమాధానం ఇదే. నేను సినిమాలు వదిలేసి ఐదేళ్లు కావొస్తోంది. మీ ఫ్రెండ్ గూగుల్ ఉంది కదా. నేను ఇప్పుడు నా కొత్త జీవితంలోకి అడుగుపెట్టాను. అందులో నటన అనే అంశమే లేదు.’ అని క్లారిటీ ఇచ్చారు రిచా.
‘లీడర్’ చిత్రంతో ఆమె నటిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత ‘నాగవల్లి’, ‘మిరపకాయ్’, ‘సారొచ్చారు’, ‘మిర్చి’, ‘భాయ్’ చిత్రాలతో మెప్పించారు. అదేవిధంగా రెండు తమిళ చిత్రాల్లో కూడా కథానాయిక పాత్ర పోషించారు.
Post A Comment: