
ప్రస్తుతం ప్రభాస్ యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న 'సాహో' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమా ఇదే కావడంతో ‘సాహో’ పై అన్ని సినీ పరిశ్రమల ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకునే సినిమా అన్ని భాషల ప్రేక్షకులకు కనెక్టయ్యే విధంగా ఉండాలని దర్శక నిర్మాతలు పనిచేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ లో హీరోయిన్ ఎవరనేది మొన్నటి వరకు సస్పెన్స్ గానే ఉంది. ఆ మధ్యలో అనుష్క, కత్రినా కైఫ్, పూజా హెగ్డేలలో ఒక్కరు ప్రభాస్ తో జోడి కడుతుందని జోరుగా ప్రచారం జరిగింది.
అయితే హీరోయిన్ గా బాలీవుడ్ భామనే తీసుకోవాలని పలువురి పేర్లు పరిశీలించారు చిత్ర దర్శక నిర్మాతలు. అందులో భాగంగానే హీరోయిన్ బాలీవుడ్ నటిని తీసుకోవాలని భావించిన వారు పలువురి పేర్లను పరిశీలించి చివరగా స్టార్ హీరోయిన్ శ్రద్ధాకపూర్ ను ఫైనల్ చేశారు. ఈ మేరకు నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ‘ఆషికి 2’తో పాటు పలు హిందీ చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకొంది శ్రద్ధాకపూర్. ఆమె తెలుగులో నటిస్తున్న తొలి చిత్రం ‘సాహో’నే.
Happy to announce the leading lady of Saaho, The beautiful @ShraddhaKapoor it is. Here's welcoming her to #Saaho family. #UVCreations pic.twitter.com/mYUAHQa23a— UV Creations (@UV_Creations) August 15, 2017
Post A Comment: