ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగర్‌కు తిరుగులేని స్టార్‌డమ్ తెచ్చిపెట్టిన చిత్రం ‘టెర్మినేటర్’. వేల కోట్ల రూపాయలు వసూళ్లు కురిపించిన సినిమా. ఇంత గొప్ప ‘టెర్మినేటర్’ ఎలా పుట్టాడో తెలుసా? అర్ధరాత్రి వచ్చిన ఓ పీడకల నుంచి ‘టెర్మినేటర్’ ఆలోచన వచ్చినట్లు ఆ చిత్ర దర్శకుడు జేమ్స్ కామెరూన్ చెప్పారు. ‘‘ఓ రోజు నాకు భగభగమండే మంటల్లోంచి అస్థిపంజరం లేస్తున్నట్లు భయంకరమైన కలొచ్చింది. ఆ దృశ్యం అలా నా మెదడులో ముద్రించుకుపోయింది. దాన్ని ఆధారం చేసుకునే ‘టెర్మినేటర్’ కథ డెవలప్ చేశాన’’ని చెప్పారు కామెరూన్.
‘అవతార్’కు కూడా కలలే ఆధారం అంటున్నారు కామెరూన్. ‘‘అవతార్’కు నా కళాశాల రోజుల్లోనే బీజం పడింది. అప్పట్లో నాకు తరచుగా కలల్లో దట్టమైన అడవులు కనిపించేవి. ఆ దృశ్యాలనే ఆ తర్వాత ‘అవతార్’లో వెండితెరపై ఆవిష్కరించా’’ అన్నారు కామెరూన్. ప్రస్తుతం ‘అవతార్’కు నాలుగు సీక్వెల్స్ రూపొందించే సన్నాహాల్లో బిజీగా ఉన్నారాయన.
Post A Comment: