మహేష్, అనుష్కలు 'ఖలేజా' చిత్రంతో ఆకట్టుకున్నారు. ఆ ఇద్దరూ కలిసి మరోసారి తెరపై సందడి చేయబోతున్నారని ఫిల్మ్‌నగర్ వర్గాలు మాట్లాడుకొంటున్నాయి. కాకపోతే ఈసారి మహేష్ సినిమాలో అనుష్క కథానాయిక కాదట. ఆమె ఓ ప్రత్యేకగీతంలో కనిపించనుందని సమాచారం. మహేష్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ‘భరత్ అను నేను..’ అనే చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ భామ కైరా అడ్వానీ కథానాయికగా నటిస్తోంది. ఇందులో అదిరిపోయే ఓ ప్రత్యేకగీతం ఉందట. ఆ పాట కోసమే అనుష్కని సంప్రదించినట్టు సమాచారం. ఆమె కూడా ఆడిపాడటానికి సుముఖంగా ఉన్నట్టు తెలిసింది.
ఇటీవల కథానాయికలు ప్రత్యేక పాటలపై మక్కువ ప్రదర్శిస్తున్నారు. పైగా అనుష్క ఇదివరకు పలు చిత్రాల్లో ప్రత్యేకగీతాలు చేసింది. ఆమెకి పాట, కాంబినేషన్ నచ్చడంతో వెంటనే అంగీకారం తెలిపిందని ప్రచారం సాగుతోంది. మరోసారి ఆమె తన ప్రత్యేకమైన అందాన్ని తెరపై ప్రదర్శించనుందన్నమాట. ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ తర్వాత అనుష్క కేవలం ‘భాగ్‌మతి’ మాత్రమే ఒప్పుకొంది.
Post A Comment: