Telugu Movie Gossips | Latest Telugu Cinema Gossips | Tollywood Film Gossips | Tollywood Gossips | All Cinema Gossips | Cinerangam.com

టాలీవుడ్‌లోని సూపర్‌ డూపర్‌ కాంబినేషన్లలో ఎన్టీఆర్‌ - రాజమౌళిలది ఒకటి. రాజమౌళి ప్రయాణం ఎన్టీఆర్‌ సినిమాతోనే మొదలైంది.వీరిద్దరూ కలిసి ‘స్డూడెంట్‌ నెం.1’, ‘సింహాద్రి’, ‘యమదొంగ’లతో హ్యాట్రిక్‌ కొట్టేశారు. ‘యమదొంగ’ విడుదలై ఏడేళ్లయిపోయింది. అప్పటి నుంచీ... ఎన్టీఆర్‌ - రాజమౌళి జట్టు కట్టలేదు. ఇప్పుడు అందుకు ముహూర్తం కుదిరిందని టాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ‘బాహుబలి’ చిత్రం తరవాత రాజమౌళి సినిమా ఎన్టీఆర్‌తోనే అన్నది టాలీవుడ్‌ టాక్‌.

ప్రస్తుతం ఎన్టీఆర్‌ ‘జై లవకుశ’తో బిజీగా ఉన్నారు. ఆ తరవాత త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ సినిమా చెయ్యాల్సి వుంది. త్రివిక్రమ్‌తో సినిమా పూర్తయ్యాకే రాజమౌళి - ఎన్టీఆర్‌ల సినిమా ఉంటుందా? లేదంటే ‘జై లవకుశ’ పూర్తవ్వగానే మొదలెట్టేస్తారా? అనే విషయాలు తెలియాల్సివుంది.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: