ఈ మధ్య స్టార్ రచయితలంతా దర్శకులుగా మారిపోతున్నారు. ఇప్పటికే వక్కంతం వంశీ బన్నీతో ‘నా పేరు సూర్య’ సినిమాను స్టార్ట్ చేయగా ఇప్పుడు మరొక రచయిత శ్రీధర్ సిపాన దర్శకుడిగా మారుతున్నారు. ఈయన దర్శకత్వం వహించనున్న తొలి చిత్రానికి ‘బృందావనమది అందరిది’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. పూర్తి స్థాయి కుటుంబ కథా చిత్రంగా ఉండనున్న ఈ చిత్రంలో కామెడీ, ఎమోషన్స్ ఎక్కువగా ఉండనున్నాయట. తన వద్ద కమర్షియల్ కథలు చాలానే ఉన్నా మొదటి సినిమాగా ఈ కథ అయితే బాగుంటుందని, దర్శకుడిగా మంచి గుర్తింపు వస్తుందని దీన్ని ఎంచుకున్నట్లు తెలిపారు.
ఈ నెల 29న ఈ సినిమాకు సంబందించి మరిన్ని విషయాలు వెలువడనున్నాయి. శ్రీధర్ సిపాన గతంలో ‘పూల రంగడు’, ‘సర్దార్ గబ్బర్ సింగ్’, ‘పోటుగాడు’, ‘లౌక్యం’ వంటి సినిమాలకు సంభాషణలు అందించి మంచి పేరు తెచ్చుకున్నాడు.
Post A Comment: