Telugu Movie News | Latest Telugu Cinema News | Tollywood Film News | Tollywood News | All Cinema News | Cinerangam.com

మెగా హీరో వరుణ్ తేజ్, దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్లో వచ్చిన ‘మిస్టర్’ చిత్రం గత శుక్రవారం విడుదలై బాక్సాఫీస్ వద్ద నెగటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో ప్రేక్షకులకు అంతగా నచ్చని అంశాల్లో సినిమా రన్ టైమ్ కూడా ఒకటిగా ఉంది. రెండు భాగాల్లోనూ నిడివి ఎక్కువగా ఉండటంతో ఆడియన్స్ చాలా ఇబ్బంది ఫీలయ్యారు. ఈ విషయాన్నే గమనించిన చిత్ర యూనిట్ రన్ టైమ్ కాస్త తగ్గిస్తే బాగుంటుందని భావించిందట. అందుకే సినిమాలోని కొన్ని సీన్లను సుమారు 17 నిముషాల నిడివి వరకు కట్ చేసినట్టు సమాచారం. ఈ కత్తిరింపులతో ఆడియన్స్ కాస్త వెసులుబాటు ఫీలయ్యే అవకాశముందని, ఈ కటింగ్స్ లో కొన్ని అనవసరమైన బోరింగ్ సీన్స్ కూడా తొలగించబడ్డాయని, దీంతో చిత్రాన్ని చూడటం మునుపటి కంటే ఇప్పుడు ఇంకాస్త సౌకర్యవంతంగా ఉందని తెలుస్తోంది. వరుణ్ తేజ్ సరసన లావణ్య త్రిపాఠి, హెబ్బా పటేల్ లు జంటగా నటించిన ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు, నల్లమలపు బుజ్జిలు సంయుక్తంగా నిర్మించారు.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: