ఇలయ దళపతి విజయ్ ‘తెరి’ చిత్రం తర్వాత ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో తన 61వ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఆయన మూడు పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం తండ్రి పాత్రకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ పాత్రలో విజయ్ గడ్డంతో నటిస్తున్నారు. ఆయనకు భార్యగా నిత్యామేనన్ కనిపించనుంది. కథ ప్రకారం మదురై జిల్లా మానూర్‌కు చెందిన విజయ్ గ్రామ అధ్యక్షుడిగా కనిపిస్తారని సమాచారం. ప్రజా సమస్యలపై మంచి తీర్పులు చెప్పడం, వూరికి కనీస వసతులను తన సొంత ఖర్చుతో కల్పించడంలాంటివి ఆ పాత్ర లక్షణంగా చూపనున్నారు. దీనికోసం పాఠశాల, ఆస్పత్రి భవనం వంటి వాటిని నిర్మించే సన్నివేశాలను ఒక పాటగా చిత్రీకరిస్తున్నట్లు దర్శకుడు అట్లీ వెల్లడించారు.
శ్రీ తేనాండల్ ఫిల్మ్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమాలో విజయ్ సరసన కాజల్ అగర్వాల్, సమంతా, నిత్యామేనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. విజయేంద్ర ప్రసాద్ కథ అందించిన ఈ చిత్రానికి ఏ.ఆర్. రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు.
Post A Comment: