
మంచు మనోజ్ హీరోగా నటించిన ‘కరెంటు తీగ’ చిత్రంతో తెలుగు తెరపై మెరిసిన బాలీవుడ్ నటి సన్నీలియోన్ మరోసారి టాలీవుడ్ ప్రేక్షకులను ఉర్రూతలూగించనుంది. నటుడు డా. రాజశేఖర్ నటిస్తున్న తాజా చిత్రం ‘పిఎస్వి గరుడవేగ 126.18M’లో సన్నీలియోన్ ఒక ఐటమ్ సాంగ్ చేయనుందట. ఇప్పటికే చిత్ర నిర్మాతలు, దర్శకుడు ఆమెతో చర్చలు జరిపారని, ఆమెకు భారీ మొత్తాన్ని ఆఫర్ చేశారని తెలుస్తోంది. సన్నీలియోన్ కూడా ఈ ఆఫర్ పట్ల సుముఖుంగానే ఉందని సమాచారం. ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో రాజశేఖర్ పోలీస్ పాత్రలో కనిపించనుండగా ఇందులో ఎక్కువ భాగాన్ని జార్జియాలో షూట్ చేశారు. ‘గుంటూరు టాకీస్’ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండగా ‘విశ్వరూపం’ ఫేమ్ పూజా కుమార్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇదివరకే రిలీజైన ఫస్ట్ లుక్ పాజిటివ్ స్పందన తెచ్చుకోగా తన ఫ్యామిలీ ఫ్రెండ్స్ స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రం తనకు మునుపటి గుర్తింపును తెచ్చిపెడుతుందని రాజశేఖర్ భావిస్తున్నారు.
Post A Comment: