తెలుగు హీరోయిన్ రాశి రాశి ప్రధాన పాత్రలో ఓ థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతుంది. 'లంక' అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను శివరాత్రి పర్వదినం సందర్భంగా ఈ రోజు విడుదల చేశారు. 'గోకుళంలో సీత', 'శుభాకాంక్షలు' చిత్రాల ద్వారా హీరోయిన్ గా పాపులర్ అయిన తెలుగు హీరోయిన్ రాశి, ఆ తర్వాత చిన్న చిన్న సినిమాలకు మాత్రమే పరిమితం అయింది. అవకాశాలు తగ్గడంతో వ్యాంపు క్యారెక్టర్లు కూడా చేసింది. చివరి సారిగా ఆమె మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘నిజం’ చిత్రంలో విలన్‌గా, అనంతరం రవితేజ 'వెంకీ' చిత్రంలో ఐటం సాంగ్‌లో కనిపించి తెరమరుగైంది. 'కళ్యాణ వైభోగమే' చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ చిత్రంలో హీరోయిన్‌కి తల్లిగా నటించింది. ఆ మధ్య బుల్లి తెరపై కూడా కాస్త సందడి చేసింది.

తాజాగా విడుదలైన 'లంక' ఫస్ట్ లుక్‌లో రాశీ ఈజ్ బ్యాక్ అనేలా ఉంది. ఈ సినిమా అంతా రాశీ చుట్టూనే న‌డుస్తుంద‌ట‌. ఇందులో రాశి పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందని వార్తలు వస్తుండగా వెండతెరపై రాశి మ్యాజిక్ ఎలా వర్కవుట్ అవుతుందనే దానిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. సైలెంట్ గా షూటింగ్ పూర్తి చేసుకొన్న ఈ చిత్రం... ఇప్పుడు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల్లో ఉంది.

రాశి భర్త శ్రీ ముని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, రోలింగ్ రాక్స్ బ్యానర్ పై ఈ మూవీ రూపొందుతుంది. శ్రీ చరణ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా నిల‌బ‌డాల‌ని విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్న రాశీకి... ఈ హార‌ర్‌ సినిమా ఎంత వ‌ర‌కూ బ్రేక్ ఇస్తుందో చూడాలి.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: