మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో బి. ఉన్నిక్రిష్ణన్ దర్శకత్వంలో మలయాళంలో ఒక భారీ బడ్జెట్ చిత్రం రూపొందుతోంది. ఇందులో హన్సిక, విశాల్, తెలుగు హీరో శ్రీకాంత్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పుడు తాజాగా 'మంజు వారియర్' ని ఈ చిత్రం కోసం హీరొయిన్‌గా ఎంపిక చేసుకున్నట్లు తెలిసింది. మోహన్‌లాల్‌తో ఆమెకి ఇది 5వ చిత్రం. ఈ క్రైం థ్రిల్లర్ చిత్రంలోని పాత్ర డిమాండ్ మేరకు బరువు తగ్గటం కోసం మోహన్‌లాల్ కసరత్తులు ప్రారంభించినట్లు సమాచారం. అలాగే, 'పులి మురుగన్' (తెలుగులో 'మన్యం పులి'గా విడుదలయ్యింది) చిత్రానికి అద్భుతంగా స్టంట్ కొరియోగ్రఫి చేసిన పీటర్ హెయిన్స్ ఈ సినిమాకి కూడా పనిచేస్తున్నారు. ఇక ఈ చిత్రంలోని విఎఫ్ఎక్స్ కోసం హాలీవుడ్ నిపుణులు పని చేస్తారని తెలిసింది.

ఈ భారీ చిత్రానికి రాక్‌లైన్ వెంకటేష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: