ప్రముఖ రచయిత్రి కీ.శే. శ్రీమతి కమలా సురయ్య (అలియాస్ కమలా దాస్, అలియాస్ మాధవీ కుట్టి) జీవితం ఆధారంగా దర్శకుడు కమల్ 'ఆమి' పేరుతో మలయాళ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రధాన పాత్ర కోసం ముందుగా బాలీవుడ్ హీరోయిన్ విద్యా బాలన్‌ని ఎంపిక చేసుకున్నారు. ఐతే కొన్ని కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. దీంతో నవంబర్‌లో ప్రారంభం కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. ఇప్పుడు ఆమె స్థానంలో ప్రముఖ మలయాళ హీరోయిన్ 'మంజు వారియర్'ని ప్రధాన పాత్ర కోసం ఎంపిక చేసుకున్నట్లు దర్శకుడు కమల్ ధ్రువీకరించారు. ఈ పాత్ర కోసం ఆమె బరువు పెరుగుతున్నట్లు ఆయన చెప్పారు. ఇతర ప్రధాన పాత్రల్లో పృధ్వీరాజ్, అనూప్ మీనన్, మురళి గోపి నటిస్తున్న ఈ చిత్రం మార్చి నెలలో ప్రారంభం కానుందని దర్శకుడు తెలియజేసారు.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: