వాలెంటైన్స్ డే సందర్భంగా సినిమా ఫస్ట్ లుక్ లు, స్పెషల్ టీజర్స్ ని రిలీజ్ చేయడం సహజమే. ఈసారి కూడా వాలెంటైన్స్ డే ని సినిమాల ప్రమోషన్స్ కోసం వాడేసుకొంటున్నారు. అయితే బాహుబలి టీమ్ ఓ కొత్త స్ట్రాటజీ తో ముందుకు వచ్చింది. బాహుబలి గ్రీటింగ్స్ ని రెడీ చేసింది.

రొటీన్ గా పువ్వులు, లవ్ సింబల్స్ తో ఉన్న గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చి బోర్ కొట్టిందా… అయితే వెరైటీగా బాహుబలి గ్రీటింగ్ ఇవ్వండి అంటూ ముందుకు వచ్చింది సినిమా యూనిట్. ఆ గ్రీటింగ్స్ ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలి…ఎలా తయారుచేయాలి…ఎలా ప్రజెంట్ చేయాలో తెలుపుతూ ఓ డెమో వీడియోను కూడా పోస్ట్ చేసింది.

రాజమౌళి సృష్టించిన బాహుబలి సిరీస్ లో అమరేంద్ర బాహుబలి, దేవసేన పాత్రలు గొప్ప ప్రేమకు చిహ్నాలు. రాబోయే రెండవ భాగమంతా వీరి ప్రేమ కథ మీదే నడవనుంది. అందుకే బాహుబలి టీమ్ ఈ మధ్య విడుదల చేసిన అమరేంద్ర బాహుబలి, దేవసేనల పోస్టర్ తో గ్రీటింగ్ కార్డు తయారు చేసారు.

అందులో ఒక రొమాంటిక్ మెసేజ్ ను సైతం పొందుపరిచి అందమైన వాలంటైన్స్ డే గ్రీటింగ్ కార్డును తయారు చేశారు. దాన్ని బాహుబలి బ్లాగ్ లోకి వెళ్లి డౌన్లోడ్ చేసుకునే సౌకర్యం కల్పించి ప్రేమికులకు సహాయపడుతున్నారు.

ప్రేమకు చిహ్నంగా తీర్చి దిద్దిన ఈ రెండు పాత్రల స్ఫూర్తితో డిజైన్ చేయబడ్డ ఈ బాహుబలి గ్రీటింగ్ కార్డులను ఎన్ని వేల సంఖ్యలో డౌన్ లోడ్ అయితే ఈ మూవీ పట్ల ప్రస్తుతం ఉన్న క్రేజ్ ఎంత స్థాయిలో ఉందో తెలుస్తుందంటూ మీడియా ఆసక్తిగా చూస్తోంది.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: