1996లో ప్రజల్లో ఉత్సాహాన్ని, ఉద్వేగాన్ని నింపి.. లంచగొండితనం, అవినీతిపై ఉక్కుపాదంలా నిలిచినన చిత్రం ‘ఇండియన్’. 22 ఏళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాపై కమల్‌హాసన్ స్పందిస్తూ శంకర్ దర్శకత్వంలోని ‘ఇండియన్ 2’ ఈ నెల 14 నుంచి మొదలవుతుందని, ఈ చిత్రం తర్వాత ఇకపై నటించనని పేర్కొన్నారు. అందువల్లే లైకా సంస్థ ఈ సినిమాను మరింత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. శంకర్ కూడా దీనిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు సమాచారం. ఓ వైపు రాజకీయాల్లో తలమునుకలై ఉన్న విశ్వనటుడు కమల్‌హాసన్ ఈ చిత్రానికి మరింత ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎందుకంటే తన సినీ జీవితానికి మాత్రమే కాకుండా రాజకీయ జీవితానికి మరింత ఉపయోగపడేలా ఈ కథ ఉంటుందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
ఇక ‘ఇండియన్ 2’ చిత్రంలో కథానాయిక ఎవరనే అంశంపై కొన్ని రోజులుగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. నయనతార, కాజల్ అగర్వాల్ పేర్లు ప్రధానంగా వినిపించాయి. ఈ నేపథ్యంలో కాజల్‌నే ఖరారు చేసినట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయాన్ని కాజల్ కూడా ధ్రువీకరించారు. దీనిపై ఆమె స్పందిస్తూ ‘కమల్‌హాసన్‌తో తొలిసారిగా నటిస్తుండటం ఆనందంగా ఉంది. నిర్మాణ సంస్థ నుంచి అధికారికంగా ప్రకటన వస్తుందని’ పేర్కొన్నారు.
కాగా ఇతర భారతీయ భాషలన్నిట్లోనూ ఈ సినిమా విడుదల అవ్వనుంది. అందుకే ఇతర భాషల నటులను కూడా ఈ సినిమాలో తీసుకుంటున్నాడు శంకర్. తెలుగు కమెడియన్ వెన్నల కిషోర్ ను ఈ సినిమాలో ఓ కామిక్ పాత్రను చేయనున్నాడు. అలాగే మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, తమిళ్ హీరో శింబు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించనున్నారు.
Post A Comment: