Hollywood Movie News | Latest Hollywood Cinema News | Hollywood Film News | Hollywood News | All Cinema News | Cinerangam.com

హాలీవుడ్‌లో రూపొందించిన మరో సూపర్‌హీరో చిత్రం ‘ఆక్వామేన్‌’. జేసన్‌ మొమోవా ఈ చిత్రంలో టైటిల్‌ రోల్‌లో నటిస్తున్నారు. జేమ్స్‌ వాన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను విడుదలకు ముందే చూసే అవకాశం ఉంది. అదెలాగంటారా..? ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్‌ 21న విడుదల కాబోతోంది. అయితే అమెజాన్‌ ప్రైమ్‌లో సభ్యత్వం ఉన్నవారు ఈ చిత్రాన్ని విడుదలకు వారం ముందుగానే వీక్షించొచ్చు. ఆటం టికెట్స్‌ అనే వెబ్‌సైట్‌ ద్వారా ఒక్కొక్కరూ పది టికెట్ల వరకు కొనుగోలు చేసుకునే సదుపాయాన్ని చిత్రబృందం కల్పిస్తోంది.

ఆ టికెట్లతో భారతదేశంలోని ఏ థియేటర్‌లోనైనా ‘ఆక్వామేన్‌’ చిత్రాన్ని చూసే అవకాశం ఉంది. గతంలోనూ అమెజాన్‌ ఇలాంటి ఆఫర్‌ను ప్రకటించింది. ‘జుమాంజి’ సినిమా విడుదల కావడానికి 12రోజుల ముందే ప్రైమ్‌ సభ్వత్వం ఉన్నవారికి ఈ చిత్రాన్ని చూసే అవకాశం కల్పించింది.

కాగా.. సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫైనల్‌ ట్రైలర్‌ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. ఆక్వామేన్‌ పుట్టుక, పెద్దవాడయ్యే కొద్ది అతనిలో కలిగే విచిత్రమైన మార్పులు, ఆక్వామేన్‌గా మారడం వెనకున్న కారణాలను ఈ ట్రైలర్‌లో చూపించారు. ఆంబర్‌ హర్డ్‌, ప్యాట్రిక్‌ విల్సన్‌ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా కోసం ఇదివరకు ఎవ్వరూ చూడని ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించినట్లు గతంలో దర్శకుడు జేమ్స్‌ వాన్‌ వెల్లడించారు.

Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: