Telugu Movie News | Latest Telugu Cinema News | Tollywood Film News | Tollywood News | All Cinema News | Cinerangam.com

ప్రముఖ సినీ నటుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు మంచు మోహన్‌బాబుకు మాతృవియోగం కలిగింది. మోహన్ బాబు మాతృమూర్తి మంచు లక్ష్మమ్మ(85) గురువారం (20 సెప్టెంబర్ 2018) ఉదయం ఆరు గంటల సమయంలో కన్నుమూశారు. ఆమె గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లక్ష్మమ్మ ఈరోజు ఉదయం కన్నుమూశారు. మంచు లక్ష్మమ్మ పార్థివదేహాన్ని తిరుపతి నుంచి ఎ.రంగంపేట సమీపంలోగల మోహన్ బాబు విద్యాసంస్థలు శ్రీ విద్యానికేతన్ ప్రాంగణంలోని ఆమె నివాసానికి తరలించారు.

అయితే ప్రస్తుతం మంచు మోహన్‌బాబుతో సహా మిగిలిన కుటుంబ సభ్యులందరూ కూడా విదేశీ పర్యటనలో ఉన్నారు. తల్లి మరణ వార్త విని మోహన్‌బాబు సహా ఆయన కుటుంబ సభ్యులు తిరుపతికి బయల్దేరారు. మరికాసేపట్లో వారంతా విద్యానికేతన్ కు చేరుకోనున్నారు. మంచు లక్ష్మమ్మ మరణంతో విద్యానికేతన్ ప్రాంగణమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. శుక్రవారం తిరుపతిలో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

తన నానమ్మ మరణవార్త విని మంచు మనోజ్‌ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ‘మా నానమ్మ లక్ష్మమ్మ దేవుడి దగ్గరికి వెళ్లిపోయారు. మిమ్మల్ని మిస్సవుతాం నానమ్మ. ఈ సమయంలో మేము భారతదేశంలో లేకపోవడం బాధకలిగిస్తోంది. ఇది అనుకోకుండా జరిగిపోయింది. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.’ అని పేర్కొన్నారు.’
మంచు లక్ష్మమ్మ గారి మృతి పట్ల సినీరంగం.కామ్ ప్రగాఢ సంతాపాన్ని తెలియచేస్తోంది.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: