Telugu Movie News | Latest Telugu Cinema News | Tollywood Film News | Tollywood News | All Cinema News | Cinerangam.com

థానాయిక సమంత అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న కొత్త సినిమా ‘యూటర్న్‌’. ‘రంగస్థలం’ తర్వాత ఆమె నటిస్తున్న చిత్రం ఇది. ఇటీవల ఈ సినిమా షూటింగ్‌, డబ్బింగ్‌ కార్యక్రమాలను సమంత పూర్తి చేసుకున్నారు. పవన్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస చిట్టూరి, రాంబాబు బందరు సంయుక్తంగా నిర్మిస్తుండగా పూర్ణ చంద్ర తేజస్వి సంగీతం సమకూరుస్తున్నారు.

కాగా, ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను ఆదివారం విడుదల చేశారు. ఇందులో సామ్‌ విభిన్నమైన లుక్‌లో కనిపించారు. ఆమె ముఖంతో పాటు, రోడ్డు, వాహనం కూడా ఈ ప్రచార చిత్రంలో కనిపించాయి. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, రాహుల్‌ రవీంద్రన్, భూమిక ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

సెప్టెంబరు 13న ‘యూటర్న్‌’ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు సమంత ఈ సందర్భంగా ట్వీట్‌ చేశారు. ‘నేను నమ్మిన సినిమా ఇది. సెప్టెంబరు 13న ఈ సినిమా చూసి, మీరూ ఇలాగే అభిప్రాయపడతారని ఆశిస్తున్నా’ అని పేర్కొన్నారు.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: