బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ ఏడాదికి ఒక సినిమా చేసినా అది బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తుంటుంది. భారత్‌లోనే కాదు చైనా, జపాన్‌లోనూ ఆమిర్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. ప్రస్తుతం ఆమిర్ ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహిస్తున్నారు.
ఎక్కువగా సముద్రం, పడవల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం ఏకంగా రెండు లక్షల కిలోల బరువున్న భారీ పడవలను రూపొందించారట.
సినిమాలో సముద్రం, పడవలే ప్రధాన పాత్రలని భావించిన చిత్రబృందం వాటి కోసం కోట్లల్లో ఖర్చు చేస్తున్నట్లు బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇప్పటివరకు హిందీ చిత్ర పరిశ్రమ కనీవినీ ఎరుగని రీతిలో సినిమాను తెరకెక్కించాలని ఆమిర్, నిర్మాత ఆదిత్య చోప్రా భావిస్తున్నారట. యూరప్‌లోని మాల్టా సముద్రతీరంలో ఈ పడవలను రూపొందించారు. వీటిని తయారుచేయడానికి ఏడాది సమయం పట్టిందని చిత్రవర్గాలు చెబుతున్నాయి.
అబ్బురపరిచే విజువల్ ఎఫెక్ట్స్‌తో సినిమాను తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కత్రినా కైఫ్, ఫాతిమా సనా షేక్ కథానాయికలుగా నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. యశ్ రాజ్ ఫిలింస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Post A Comment: