బాలీవుడ్ నటి రిచాచద్దా నటించిన హిందీ చిత్రం ‘ఫుక్‌రే రిటర్న్స్‌’.  శుక్రవారం రోజు (08 డిసెంబర్ 2017)న విడుదలై మంచి టాక్‌ అందుకున్న ఈ సినిమా తొలిరోజున రూ.8 కోట్లు వసూలు చేసింది. మృగ్‌దీప్‌ సింగ్‌ లంబా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా రిచాచద్దా ఓ ఆంగ్లపత్రికతో మాట్లాడారు. నటిగా బాలీవుడ్‌కు పరిచయమైన తొలినాళ్లల్లో ఎదుర్కొన్న సమస్యల గురించి ప్రస్తావించారు. తన సినీ కెరీర్‌ ప్రారంభంలో ఓ నటుడితో డేట్‌కు వెళ్లమని కొందరు బలవంతం చేశారని బాలీవుడ్‌ నటి రిచాచద్దా ఆరోపించారు. తనకు భద్రత కల్పిస్తామంటే.. తనను వేధించిన వ్యక్తుల పేర్లు బయటపెట్టి, వారు సిగ్గుపడేలా చేస్తానని చెప్పారు.

‘నన్ను వేధించిన వారి పేర్లు బయటపెట్టిన తర్వాత నా జీవితానికి, నా కుటుంబానికి భద్రత కల్పిస్తారా? నా కెరీర్‌ ఇప్పటిలాగే ఆ తర్వాత కూడా సజావుగా సాగుతుందని మీరు హామీ ఇవ్వగలరా? అలాగైతే ఇప్పుడే వారు ఎవరో చెబుతా. నేను ఒక్కదాన్నే కాదు.. నాలాంటి వేల మంది వేధించిన వారి పేర్లు చెప్పడానికి ముందుకు వస్తారు. కానీ మా జీవితాలకు ఎవరు రక్షణ కల్పిస్తారు?’.

‘నా సినీ కెరీర్‌ ప్రారంభంలో ఒక నటుడికి సందేశాలు పంపమని అడిగేవారు. ఆయనతో కలిసి డేట్‌కు వెళ్లాలని బలవంతం చేశారు. అతడికి పెళ్ళయిందని నేను నిరాకరించాను. ఆ తర్వాత నా కెరీర్‌ బాగా ఉండటానికి ఓ క్రికెటర్‌తో సన్నిహితంగా ఉండాలని అడిగారు. ఈ పరిశ్రమలో చాలా మార్పులు రావాలి’ అని ఆమె తెలిపారు.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: