తెలుగు తెరకు ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ చిత్రంతో పరిచయమైన హాస్యనటి విద్యుల్లేఖరామన్‌. ఆ తర్వాత వరుసగా పలు తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ‘రన్‌ రాజా రన్‌’, ‘రాజుగారిగది’, ‘సరైనోడు’ తదితర చిత్రాల ద్వారా ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టారు. తాజాగా మోడ్రన్‌ డ్రస్‌లో దిగిన ఓ హాట్‌ హాట్‌ ఫొటోను ట్విటర్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫొటోకు అభిమానుల నుంచి విశేష స్పందన వస్తోంది.

ఈ సందర్భంగా ఓ అభిమాని ‘వావ్‌ ఏం మార్పు? హీరోయిన్‌గా ప్రయత్నిస్తున్నారా?’ అని ప్రశ్నించగా, విద్యుల్లేఖరామన్‌ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ‘కచ్చితంగా కాదు. ఇలాంటి దుస్తులతో దర్శనమివ్వడానికి కూడా కారణం లేకపోలేదు. అదేంటంటే హ్యాసనటులు కూడా అందంగా ఉండాలని భావిస్తారు. పల్లెటూరి బైతులా ఉండనక్కర్లేదేని నా అభిప్రాయం’ అని సమాధాన మిచ్చారు.

‘మీరు చూపించాల్సిన అవసరం లేదు’ అని మరో అభిమాని చేసిన ట్వీట్‌కు విద్యు ఘాటైన సమాధానమిచ్చారు. ‘‘ఒక మహిళ తనను తాను ఆరాధించుకోవడం తప్పా? ఈ విధమైన సంకుచిత ధోరణులకు సమాధానమిచ్చేందుకు వెనకాడను. ఇలాంటి ఆలోచనలతో మీరు తిరోగమనంలో పయనించకండి’’ అంటూ హితవు పలికారు. అంతకుముందు ఆ హాట్‌ దుస్తుల్లో ఉన్న ఫొటోను ట్వీట్‌ చేస్తూ ‘బాస్‌లా ఫీల్‌ అవుతున్నా. నాకే కనుక గతంలోకి వెళ్లే అవకాశం ఉంటే.. నన్ను నేను ప్రేమించుకోమని చెప్పేదాన్ని, ఏదో ఒక రోజు ఆమె(నా)కలలన్నీ నిజాలయ్యేవి. ఎవరు నిన్ను కాదన్నా, నిన్ను నువ్వు ప్రేమించు’’ అని ట్వీట్‌ చేశారు.

Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: