భారత చలనచిత్ర చరిత్రలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న సినిమాగా ‘మహాభారత’ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దీని కోసం దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్‌ను కేటాయించడం విశేషం. వీఏ శ్రీకుమార్ మేనన్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ భీముని పాత్రలో కన్పించబోతున్నారు. ఎం.టి. వాసుదేవన్ నాయర్ రచించిన ‘రండమూజం’ నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. దీనిపై మోహన్‌లాల్ స్పందించారు.
అందరి పిల్లల్లాగే తానూ రామాయణ, మహాభారత గ్రంథాలను వింటూ పెరిగానని చెప్పారు. వాటిని చదివిన వారికి భీముడు ఓ భారీకాయుడుగా మాత్రమే కనిపిస్తాడని, అయితే వాసుదేవన్ నాయర్ ‘రండమూజం’ నవల చదివాక భీముడు భావోద్వేగాలున్న అద్భుతమైన మనిషిగా అందరూ గుర్తిస్తారని చెప్పారు. ఈ నవల సినిమా రూపంలో వస్తుందని ఎప్పుడూ అనుకోలేదని.. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత దీన్ని చిత్రంగా తీయాలనుకోవడం, దానికి స్వయంగా వాసుదేవన్ స్క్రీన్‌ప్లే రాయడం చాలా ఆనందంగా ఉందన్నారు. అందులోని భీముని పాత్రకు తనని ఎంచుకోవడం గౌరవంగా భావిస్తున్నానన్నారు. ఈ పాత్ర కోసం తాను పలువురు గురువుల వద్ద దాదాపు రెండు సంవత్సరాలు ప్రత్యేక శిక్షణ తీసుకుంటానని చెప్పారు. ఇందుకోసం సంవత్సరం లేదా ఏడాదిన్నర వేరే సినిమాలు ఏవీ ఒప్పుకోలేకపోవచ్చని, కానీ ఇది తన కలల ప్రాజెక్టును నిజం చేసుకోవడానికని పేర్కొన్నారు. వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ సినిమాను 2020లో విడుదల చేసేందుకు నిర్మాతలు ప్రణాళిక రూపొందించారు.
ఇలా పురాణ పాత్రలను పోషించడం మోహన్‌లాల్‌కు ఇదే మొదటిసారి కాదు. ఆయన గతంలో 1975లో విడుదలైన ‘రంగం’ మరియు 1999లో విడుదలైన ‘వనప్రస్థానం’ సినిమాల్లో భీమునిగా నటించారు.
Post A Comment: