
నటి కిమ్ శర్మ(ఖడ్గం ఫేం) భర్త అలీ పంజానీతో విడిపోయారని.. ప్రస్తుతం ఆర్థికంగా కష్టాలు పడుతున్నారని కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. దీనిపై స్పందించిన కిమ్ శర్మ అవన్నీ వట్టి పుకార్లేనని ట్విట్టర్ ద్వారా స్పష్టం చేశారు. అసలు ఏమీ జరగకుండానే వార్తలు కల్పిస్తున్నారంటూ మండిపడ్డారు. "వీకెండ్ కావడంతో శనివారం థాయ్‌లాండ్‌లో ఎంజాయ్ చేసి ఇంటికి వస్తే నా చేతిలో చిల్లిగవ్వలేదంటూ వార్తలు వస్తున్నాయి. అయినా నా గురించి నా కంటే వేరే వారికే బాగా తెలిసినట్టుంది. ఏదేమైనా నా గురించి వస్తున్నవన్నీ పుకార్లే" అని ట్వీట్ చేశారు కిమ్ శర్మ.
కిమ్ శర్మ 2010లో కెన్యాకు చెందిన వ్యాపారవేత్త అలీ పంజానీని వివాహం చేసుకున్నారు. ఇప్పుడు అలీ వేరే అమ్మాయి మాయలో పడి కిమ్‌ని వదిలేశాడని.. దీంతో ఆమె కెన్యా నుంచి ముంబయి వచ్చేసిందని.. ఆర్థికంగా కష్టాలు పడుతోందని ఇటీవల వార్తలు వచ్చాయి.
When you spend the weekend raging at #Coldplay and come back to find out you're "penniless" 😶 pic.twitter.com/4qVxBcvqlm— Kim Sharma (@kimsharma3) April 10, 2017

 
 
 
Post A Comment: