Telugu Movies Box Office News | Latest Telugu Cinemas Box Office News | Tollywood Films Box Office News | Tollywood Box Office News | All Cinemas Box Office News | Cinerangam.com

ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ‘బాహుబలి-ది కంక్లూజన్’ ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే సెన్సార్‌ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. ఈ చిత్రం రిలీజ్ కోసం అబిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతేకాదు తెలుగు రెండు రాష్ట్రాలు ఈ సినిమాకు చాలినన్ని షోలు వేసుకోమంటూ ఫర్మిషన్ ఇచ్చి బంపర్ ఆఫర్ ప్రకటించారు. దాంతో ఈ సినిమాను ఏ ఏరియాకు ఎంతకి అమ్మారు, ఎంత బిజినెస్ జరిగిందనే విషయమై ట్రేడ్ వర్గాల్లో భారీ ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ‘బాహుబలి’ తొలిభాగం సాధించిన ఘన విజయంతో సీక్వెల్ పై భారీగా అంచనాలున్నాయి. దీంతో ‘బాహుబలి-ది కంక్లూజన్’ తెలుగు ప్రదర్శన హక్కులు భారీ మొత్తానికి అమ్ముడయ్యాయి. ఆ వివరాలు ఇక్కడ చూడవచ్చు.

నైజాం: 47.5 కోట్లు
సీడెడ్: 25 కోట్లు
వైజాగ్ + కృష్ణా: 23 కోట్లు
గుంటూరు: 11.5 కోట్లు
తూర్పు+ పశ్చిమ: 17.50 కోట్లు
నెల్లూరు: 5.50 కోట్లు
మొత్తం తెలంగాణా + ఆంధ్రప్రదేశ్: Rs 130 కోట్లు

అప్పట్లో ‘బాహుబలి’ బిజినెస్ చూసి ఔరా అనుకుంటే.. ఇప్పుడు రెట్టింపు రేట్లకు ఈ సీక్వెల్ రైట్స్ అమ్ముడవటం పెద్ద ఆశ్చర్యకరమైన విషయమేమీ కాదు. ఇక పెట్టిన పెట్టుబడిని వెనక్కి రాబట్టుకునేందుకు తమ సినిమా టికెట్ రేట్లను రూ.200 వరకూ పెంచేందుకుగానూ ఈ చిత్ర యూనిట్ ప్రభుత్వాన్ని అనుమతి కోరింది. అయితే దీనికి నిరాకరించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కువ షోస్ ప్రదర్శించేందుకు మాత్రం అనుమతించింది. దీంతో ఇప్పడు సింగిల్ స్క్రీన్స్ లో కూడా రోజుకు ఆరు ఆటలు ఈ సినిమాను ప్రదర్శించబోతున్నారు. సినిమా విడుదలైన తొలి వారం ఇది చెల్లుబాటు అవుతుంది. భారీ వసూళ్లు రాబడుతుందనే అంచనాలు ఉన్న ఈ మూవీ మరో రెండు ఆటలు పెరిగాయి కనుక ఇప్పుడు బిజినెస్ కి తగ్గట్లే రికార్డ్ స్థాయి వసూళ్లను రాబడుతుందని అందరూ అంచనాలు వేస్తున్నారు.

అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా 'బాహుబలి-2'కి బంపరాఫరిచ్చింది. రిలీజైన రోజు నుంచి మొదటి 10 రోజుల వరకు తెలంగాణాలోని అన్ని థియేటర్లలో 6 షోల వరకు వేసుకోవచ్చని అనుమతిచ్చిన ప్రభుత్వం ఆ తర్వాత నుంచి ఎప్పటిలా నాలుగు కాకుండా ఐదు ప్రదర్శనలకు అనుమతిచ్చింది. ఈ విషయాన్ని నిర్మాతలలో ఒకరైన ప్రసాద్ దేవినేని స్వయంగా తెలిపారు. అలాగే అడిగిన వెంటనే అనుకూలంగా స్పందించిన తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు కృతజ్ఞతలని, మొదటి 10 రోజులు తర్వాత అన్ని థియేటర్లలో 5 షోలు వేస్తామని తెలిపారు. ఇలా రోజుకు ఐదు షోలు ప్రదర్శించడం వలన చిత్ర వసూళ్లు వేగం పుంజుకుని మరింతగా పెరిగే అవకాశముందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నారు.

170 నిముషాల నిడివి ఉన్న ఈ చిత్రం ఒక్క ఇండియాలోనే 6500 థియేటర్లలో రిలీజవుతుండటం విశేషం. ఈ మధ్యకాలంలో ఈ స్థాయిలో భారీగా విడుదల అవుతున్న చిత్రం ఇదే.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: