ర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనకు బాగా కలిసొచ్చిన, బోలెడంత క్రేజ్ తెచ్చిపెట్టిన 'సర్కార్' సిరీస్ లో మూడవ సినిమా చేశారు. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమాను మొదట తన పుట్టినరోజైన ఏప్రిల్ 7న రిలీజ్ చేస్తానని వర్మ చెప్పాడు. కానీ ప్రస్తుతం ఈ చిత్రం విడుదల వాయిదా పడింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అనుకున్న సమయానికి పూర్తి కాకపోవడంతో సినిమాను ఏప్రిల్ 7 నుండి మే 12 కు వాయిదా వేస్తున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ ఈరోస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రకటించింది. దీంతో అమితాబ్ బచ్చన్, వర్మ అభిమానులు కాస్త నిరుత్సాహానికి గురయ్యారు. ఈ పొలిటికల్ థ్రిల్లర్లో అమితాబ్ తో పాటు జాకీ ష్రాఫ్, మనోజ్ బాజ్‌పాయ్, యామీ గౌతమ్ లు నటిస్తున్నారు.
ఇదిలా వుండగా... ఎప్పుడు క్రియేటివిటీ గురించి మాట్లాడే దర్శకుడు రాంగోపాల్‌ వర్మకు ఓ వ్యక్తి షాకిచ్చాడు. వర్మ తాజాగా అమితాబ్‌తో తీస్తున్న 'సర్కార్‌ 3' కథ, స్క్రీన్‌ప్లే తనవేనని, వర్మ తనకు టైటిల్‌ కార్డ్స్‌లో పేరు వేస్తానని చెప్పి వేయలేదని, అలాగే తనకు ఇస్తానన్న పారితోషికాన్ని కూడా ఇవ్వలేదని ముంబై హైకోర్టులో కేసు వేశాడు. దీంతో న్యాయస్ధానం ఆయన బాధను అర్ధం చేసుకుని, ఆ కేసు వేసిన నీలేష్‌కు 'సర్కార్‌ 3' చిత్రాన్నివిడుదలకు ముందే ప్రదర్శించాలని, అలాగే 6.2 లక్షలను కోర్టులో ముందుగా డిపాజిట్‌ చేయాలని ఆదేశించింది.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: