నితిన్‌ హీరోగా, హను రాఘవపూడి దర్శకత్వంలో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మిస్తున్న భారీ చిత్రానికి ‘లై’ (లవ్‌ ఇంటెలిజెన్స్‌ ఎన్‌మిటి) టైటిల్‌ని కన్‌ఫర్మ్‌ చేశారు. మార్చి 30న హీరో నితిన్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ – "ఈరోజు మా హీరో నితిన్‌ పుట్టినరోజు సందర్భంగా ‘లై’ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశాం. హైదరాబాద్‌లో ఈ చిత్రానికి సంబంధించి ఓ భారీ షెడ్యూల్‌ జరిగింది. ఏప్రిల్‌ 4న అమెరికా షెడ్యూల్‌ ప్రారంభమవుతుంది. జూన్‌ రెండో వారం వరకు సాగే ఈ షెడ్యూల్‌లో వెగాస్‌, లాస్ ఏంజెల్స్, శాన్‌ఫ్రాన్సిస్కో, చికాగో వంటి అందమైన లొకేషన్స్‌లో షూటింగ్‌ జరుగుతుంది. దీంతో 90 శాతం షూటింగ్‌ పూర్తవుతుంది. ఆగస్ట్‌ 11న ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నాం. 'కృష్ణగాడి వీరప్రేమగాథ' తర్వాత హను రాఘవపూడి కాంబినేషన్‌లో నితిన్‌ హీరోగా చేస్తున్న ఈ సినిమా మా బేనర్‌లో మరో సూపర్‌హిట్‌ మూవీ అవుతుంది" అన్నారు.
నానికి 'కృష్ణగాడి వీరప్రేమగాథ' వంటి సక్సెస్ ఇచ్చిన హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై మంచి క్రేజ్ క్రియేట్ అవుతోంది. ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో నితిన్ కి జోడీగా మేఘా ఆకాష్ నటిస్తోంది.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: