రాజమౌళి ‘బాహుబలి – ది బిగినింగ్’ చిత్రానికి సీక్వెల్ గా రూపొందుతున్న‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ప్రపంచ సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రంపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి.

తాజాగా చిత్రం ట్రైలర్ రెడీ అయిందని, ప్రస్తుతం ఇది తెరపై ఎలా ఉందన్న విషయాన్ని పరీక్షిస్తున్నామని చిత్రం సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. అన్నపూర్ణా స్టూడియోస్ లో ట్రైలర్ తయారైందని చెబుతూ, దీన్ని పరీక్షిస్తున్న సమయంలో తీసిన ఓ ఫోటోను ట్విట్టర్ పేజీలో పోస్టు చేశాడు సెంథిల్. ఈ సినిమాపై వర్క్ చేస్తున్నామని... సీవీ రావు, శివకుమార్ లతో కలసి తెరపై ఎలా కనిపిస్తుందన్న విషయాన్ని చూస్తున్నామని కామెంట్ పెట్టాడు. మరో పది రోజుల్లో ఈ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వస్తుందని అంచనా.
2015లో విడుదలైన ‘బాహుబలి: ది బిగినింగ్‌’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రాన్ని పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శించారు. ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డును పొందింది.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: