పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ హీరోగా విడుదలైన ‘టెంపర్‌’ చిత్రం తెలుగులో హిట్‌గా నిలిచింది. కాజల్‌ కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని హిందీలో అభిషేక్‌ బచ్చన్‌తో చేయాలని అప్పట్లో పూరీ అనుకున్నారు. తర్వాత ఆ చిత్రం నిలిచిపోయింది. ఇప్పుడు దీని రీమేక్‌ హక్కులను బాలీవుడ్‌ దర్శకుడు రోహిత్‌ శెట్టి సొంతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాను రణ్‌వీర్‌ సింగ్‌తో చేయడానికి రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ చిత్రంలో కథానాయికగా నటించే అవకాశం కాజల్‌కు దక్కినట్లు తెలిసింది. మాతృకను చూసిన రోహిత్‌, హీరోయిన్‌గా కాజల్‌ అయితేనే సరిపోతుందని భావించారట. దీంతో ఆమెను తీసుకోవడానికి సిద్ధపడ్డట్లు బాలీవుడ్‌ సమాచారం.

కాగా, ఇటీవల కాజల్‌ మీడియాతో మాట్లాడుతూ బాలీవుడ్‌ చిత్రాల్లో నటించే అవకాశం ఉందని చెప్పారు. రెండు పెద్ద బ్యానర్లపై నిర్మిస్తున్న చిత్రాల కోసం తనను సంప్రదించినట్లు తెలిపారు. అయితే అందులో ‘టెంపర్‌’ రీమేక్‌ లేదని తెలిపారు. రణ్‌వీర్‌తో కలిసి నటించడాన్ని ఆస్వాదిస్తానని ఆమె పేర్కొన్నారు.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: