దర్శకుడు రాజమౌళి రూపొందించిన ‘బాహుబలి:ది కంక్లూజన్’ ఇప్పటికే ప్రపంచస్థాయి సాంకేతిక విలువలతో పాటు ఉన్నతమైన హంగులతో రిలీజవుతుండగా కొత్తగా మరో విశేషం ఆ చిత్రానికి జతకానుంది. అదే 'ఐమ్యాక్స్' విధానం. ఈ విషయాన్ని రాజమౌళి ఈ రోజు ఉదయం తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేశారు. ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఐమ్యాక్స్ ఫార్మాట్లో రిలీజవుతుంది. దీని ద్వారా చిత్రం యొక్క భారీతనం మరింత పెరుగుతుందని అన్నారు. అలాగే 'బాహుబలి ' సినిమా ఇంతలా ప్రేక్షకుల ఆదరణ దక్కించుకోవడానికి కారణం ఆ సినిమాని గొప్ప స్థాయిలో నిర్మించడమేనని కూడా ఆయన అన్నారు. ఇలా ‘బాహుబలి-2’ ను ప్రపంచంలోనే అత్యున్నత టెక్నాలజీతో వీక్షించడం ప్రేక్షకులకు మరో కొత్త అనుభవం కానుంది. ఇకపోతే ఇటీవలే విడుదలైన ఈ చిత్రం యొక్క ట్రైలర్ ఇప్పటికే 85 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి సరికొత్త రికార్డుల్ని సృష్టిస్తోంది.
very excited that #Baahubali2 will release in @IMAX format, which enhances the hugeness & the spirit of Baahubali..— rajamouli ss (@ssrajamouli) March 21, 2017
Post A Comment: