వన్‌కల్యాణ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘కాటమరాయుడు’ సినిమాను మార్చి 24న విడుదల చెయ్యాలనుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే అమెరికా టూర్ నుంచి వచ్చిన పవన్ కల్యాణ్, రషెష్ చూసి కొన్ని సీన్లు సరిగా రాలేదనిపించి రెండు రోజులు రీషూట్ పెట్టుకోమని దర్శకుడుకి సూచించారని ఫిల్మ్ నగర్ వర్గాల సమచారం.

అయితే హీరోయిన్ శృతిహాసన్‌తో పాటు సినిమాలో కీలకమైన పాత్రలు చేస్తున్న ఆర్టిస్ట్‌లు చాలా బిజీగా ఉండటంతో డేట్స్ ఇబ్బంది అయ్యేటట్లు ఉందన్నారట. అయినా సరే, ఎట్టిపరిస్దితుల్లోనూ రాజీ పడి సినిమాను బయటకు తేవద్దని, ఖచ్చితంగా రీషూట్ చెయ్యాల్సిందేనని పవన్ పట్టు పట్టారని, దాంతో డేట్స్ కోసం నిర్మాత వారిని సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది.

‘సర్ధార్ గబ్బర్ సింగ్’ సినిమా వలన నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్ కోసం పవన్ కల్యాణ్ ఈసారి ‘కాటమరాయుడు’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలా అయినా వారికి వచ్చిన నష్టాల్ని పూడ్చి, తన లిస్ట్‌లో ఓ హిట్ సినిమా వేసుకోవాలనే ఉద్దేశంతో ప్రతీ విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: