సూపర్ స్టార్ మహేష్ బాబు ‘బ్రహ్మోత్సవం’ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో ‘సంభవామి’ (వర్కింగ్ టైటిల్ ) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దాదాపు 80 శాతం షూటింగ్ పూర్తయ్యింది. మిగిలిన ముంబై, పూణే షెడ్యూల్స్ పూర్తయితే షూటింగ్ పూర్తయినట్టే. అయితే ఇంతవరకు ఫస్ట్ లుక్ కానీ, టీజర్ కానీ... కనీసం ఈ చిత్రానికి చెందిన ఓ చిన్న ఫొటో కూడా బయిటకు రాలేదు. దాంతో ఎప్పుడెప్పుడు టీజర్ రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం టీజర్ గురించి ఓ ఆసక్తికరమైన విషయం బయిటకు వచ్చింది.
చిత్ర సన్నిహిత వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం అభిమానుల ఎదురుచూపులకు మంచి ఫలితమే దక్కనుందని తెలుస్తోంది. ఎందుకంటే దర్శకుడు మురుగదాస్ ఈ చిత్రం టీజర్ ను భారీ గ్రాఫికల్ వర్క్ తో, హై క్వాలిటీలో ఉండేలా రూపొందిస్తున్నారట. అది కూడా యూకేలో కావడం విశేషం. 30 సెకన్ల నిడివి ఉండే ఈ టీజర్ ద్వారా సినిమా కథాసారం ఏమిటనేది చెప్తారట. ఇకపోతే మహేష్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా నటించనున్న ఈ చిత్రం కొత్త షెడ్యూల్ రేపటి నుండి ముంబైలో మొదలుకాననుంది.
ఈ చిత్రాన్నిరంజాన్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. బాలీవుడ్ మార్కెట్ ని టార్గెట్ చేయాలంటే రంజాన్ మంచి సీజన్ అన్నది మురగదాస్ ప్లాన్. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రతి రంజాన్ కి ఓ సినిమాతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొడుతున్నాడు. ఈసారి కూడా ఆయన 'ట్యూబ్ లైట్' తో రంజాన్ కి రానున్నాడు. ఈసారి సల్మాన్ సినిమాతో పాటు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా కూడా రంగంలోకి దిగనుందని వార్త. ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి సంగీతం హరీష్ జయరాజ్ అందిస్తున్నారు.
Post A Comment: