క్కినేని నాగార్జున, అమల దంపతుల కుమారుడు అఖిల్ కెరీర్ వార్తలకన్నా, పెళ్లి వార్తలే జనాలకి ఆసక్తి కరంగా ఉంటున్నాయి. అందుకేనేమో... రోజుకో వార్త ప్రచారంలోకి వస్తోంది. తాజాగా అఖిల్ వివాహం వాయిదా పడిందనే ఓ వార్త వెబ్ మీడియాలో మొదలై, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నది. ఈ వార్తపై అటు అక్కినేని కుటుంబంగానీ, ఇటు జీవీకే ఫ్యామిలీగానీ పెదవి విప్పకపోవడం మరింత ఆసక్తిని రేకెత్తించే విషయం.

అక్కినేని అఖిల్, శ్రీయా భూపాల్ వివాహ నిశ్చితార్థం గతేడాది డిసెంబర్‌లో హైదరాబాద్‌లోని జీవీకే హౌస్‌లో అత్యంత వైభవంగా నిర్వహించారు. మే నెలలో ఇటలీలో వివాహం జరుపాలని ఇరుకుటుంబాలు నిర్ణయించాయి. ఆ మేరకు ఏర్పాట్లు కూడా చేశారు. ఇటలీ రాజధాని రోమ్‌లో జరుగనున్న అఖిల్, శ్రీయా భూపాల్ వివాహానికి దాదాపు 700 మంది అతిథులను ఆహ్వానించారు. వీరిలో బడా పారిశ్రామికవేత్తలు, దక్షిణాది సినీ పరిశ్రమ పెద్దలు, కొంత మంది బాలీవుడ్ ప్రముఖులు ఉన్నారు. అతిథులకు హోటల్ రూమ్స్, రిసార్ట్స్ చాలా వరకు బుక్ చేసేశారు.

అయితే తాజా పరిణామాల నేపథ్యంలో ఇటలీకి టికెట్లు బుక్ చేసుకున్నఅతిథులను రద్దు చేసుకోమని చెప్పినట్లు సమాచారం. అతిథులందరినీ విమాన టికెట్లు క్యాన్సిల్ చేసుకోమని గత శనివారం చెప్పినా... సరైన కారణం మాత్రం చెప్పలేదు. ఇంకా టికెట్లు బుక్ చేసుకోని వాళ్లు ఇక ఆ ప్రయత్నం మానేయాలని చెప్పినట్లు సమాచారం. ఈ మేరకు ఓ ఆంగ్ల దినపత్రిక కూడా బుధవారం ఈ వార్తను ప్రముఖంగా ప్రచురించింది.

అఖిల్, శ్రియాల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తాయని, వివాహం రద్దు కావడానికి ఇదే ప్రధాన కారణమని కొందరు ప్రచారం చేస్తున్నారు. ఇరు కుటుంబాల పెద్దలు అఖిల్, శ్రియాలతో మాట్లాడారని… అయినా ఫలితం లేకపోవడంతో, వివాహాన్ని రద్దు చేశారని వారు అంటున్నారు.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: