రుస విజయాలతో దూసుకుపోతోన్న యువ స్టార్ హీరో శర్వానంద్, తన తదుపరి సినిమా టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ను మహాశివరాత్రి సందర్భంగా విడుదల చేశారు. ‘రాధ’ అనే టైటిల్‌ను సినిమాకు ఖరారు చేసినట్లు పేర్కొన్నారు. వాస్తవానికి ఈ టైటిల్ తో వెంకటేష్, మారుతీ కాంబినేషన్ లో మూవీ ఓపెనింగ్ జరుపుకుని కూడా ఆగిపోయింది. ఆ తర్వాత ఈ టైటిల్ ని వదిలేసి...వెంకీతో బాబు బంగారం తెరకెక్కించాడు మారుతి. ఇప్పుడు వినూత్నమైన కథలతో, మంచి నటన తో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకున్నశర్వానంద్, ఒక వినోదభరిత పోలీస్ పాత్రలో చేస్తున్న చిత్రానికి 'రాధ' అనే టైటిల్ ని ఖరారు చేశారు. శర్వానంద్‌ పోలీసు దుస్తుల్లో తలపై కిరీటం, చేతిలో ఫ్లూట్‌ పట్టుకుని నవ్వుతూ ఉన్న ప్రచార చిత్రం ఆసక్తికరంగా ఉంది.

ఒక్క పాట మినహా ఈ చిత్రం షూటింగ్ కూడా పూర్తి అయ్యింది. వేసవి సెలవుల్లో, ఉగాది (మార్చ్ 29) రోజున ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆయన మాట్లాడుతూ... 'పూర్తి వినోదాత్మకంగా ఈ చిత్రం ఉంటుంది. నూతన దర్శకుడు చంద్రమోహన్ చెప్పిన కథ బాగుంది. రొమాన్స్, కామెడీ , యాక్షన్ సమపాళ్ళలో ఉండే మా సినిమా అటు క్లాస్ ప్రేక్షకులను, ఇటు మాస్ ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ సినిమాకి 'రాధ' అనే టైటిల్ చక్కగా సరిపోతుంది. ఉగాది రోజున చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం.' అని అన్నారు.

లావణ్య త్రిపాఠి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు చంద్రమోహన్ దర్శకత్వం వహిస్తున్నారు.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: