ప్రముఖ దర్శకుడు మణిరత్నం, కార్తీ, ఏఆర్ రెహమాన్ కాంబినేషన్ లో వస్తోన్న తమిళ చిత్రం 'కాట్రు వేళయిదై'. అందమైన ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నది. ఈ చిత్రాన్ని 'దిల్' రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై 'చెలియా' అనే టైటిల్ తో విడుదల చేయనున్నారు.

ఇది ప్రేమ కధా చిత్రం కావటంతో ప్రేమికుల రోజుని పురస్కరించుకుని దర్శకుడు మణిరత్నం, సంగీత దర్శకుడు ఎ.ఆర్‌. రెహమాన్‌లు కలిసి ఈ చిత్రంలోని ఓ పాటని రిలీజ్ చేసి చక్కటి ట్రీట్‌ ఇచ్చారు. ‘మైమరుపా మెరుపా నిన్నిలా నడిపిందెవరో తెలుసా..’ అంటూ సాగే ఈ పాటలో మంచుకొండల అందాలు... దానికి తోడు వినసొంపుగా రెహమాన్‌ సంగీతం ఇట్టే ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ పాట వీడియో లింక్‌ను కార్తీ ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తూ ‘ప్రేమికుల రోజున మీకు అందమైన కానుక’ అని ట్వీట్‌ చేశారు.


హీరోయిన్ అదితిరావు హైదరి ఈ పాటలో చాలా అందంగా కనిపించారు. వీరిద్దరి కెమిస్ట్రీ ఆడియన్స్ లో అంచనాలు పెంచడం ఖాయమంటూ యూనిట్ చెబుతోంది. ప్రస్తుతం ఈ పాట వీడియో యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో 10వ స్థానంలో ఉంది.

ఏప్రిల్ 7న విడుదల కానున్న ఈ చిత్రానికి...'బర్ఫీ', 'తమాషా' మరియు 'గోలియోన్ కీ రాసలీలా' చిత్రాలకు సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన రవివర్మన్ ఈ చిత్రానికీ పని చేస్తున్నాడు.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: