మిళనాడులో రీసెంట్ గా జరిగిన ‘జల్లికట్టు’ ఉద్యమం దేశం మొత్తం ఎంతటి సంచలనం సృష్టించిందే తెలిసిందే. ముఖ్యంగా తమిళనాడు మొత్తం ఈ ఉద్యమంతో ఊగిపోయింది. తమ సంస్కృతిలో భాగమైన సాంప్రదాయక క్రీడ ‘జల్లికట్టు’ పై నిషేధాన్ని ఎత్తి వేయాలంటూ తమిళ యువత, ముఖ్యంగా విద్యార్థులు శాంతియుతంగా చేసిన ఆందోళనతో కూడిన ఉద్యమం ఎన్నో విషయాల్లో స్ఫూర్తిగా నిలిచింది. సినిమా సెలబ్రెటీలంతా ఈ ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. కేవలం తమిళనాడు సినిమా వాళ్లే కాకుండా ఇక్కడ లోకల్ గా ఉన్న మహేష్ వంటి స్టార్స్ సైతం ట్విట్ తో సపోర్ట్ చేసారు. అయితే జల్లికట్టుకు తన మద్దతు తెలుపుతూ... ప్రత్యేక హోదా విషయంపై ఏ విధంగానూ స్పందించకపోవడంతో మహేష్ పై విమర్శలు సైతం వెల్లువెత్తాయి.

అది ప్రక్కన పెడితే… ఇప్పుడు ఏకంగా మహేష్ తన తాజా సినిమాలో ‘జల్లికట్టు’ ప్రస్తావన తీసుకువస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆ చిత్ర దర్శకుడు మురుగదాస్ డిసైడ్ అయి, స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేర్పులతో సీన్స్ రెడీ చేసినట్లు తమిళ సినీ వర్గాల నుంచి వార్తలు వస్తున్నాయి. ఈ జల్లికట్టు అంశాన్ని స్ఫూర్తిగా తీసుకుని మహేష్ తో చేస్తోన్న ‘సంభవామి యుగే యుగే’ (వర్కింగ్ టైటిల్) సినిమాలోని క్లైమాక్స్‌లో జల్లికట్టు ఆందోళనలకు తగ్గట్లు సీన్లను మురుగదాస్ డిజైన్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఈ కారణంగానే ఇప్పుడు సినిమా ఆలస్యమవుతోందని సమాచారం. ముఖ్యంగా మహేష్‌కు తమిళనాట మార్కెట్ పెరగటానికి ఇలాంటి సన్నివేశాలు అవసరం అంటున్నారు.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: