సినీ నటి అమలాపాల్, ఆమె భర్త దర్శకుడు విజయ్‌లకు చెన్నై ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. జ్యూడీషియల్ సెపరేషన్‌లో భాగంగా గత ఆర్నెల్లుగా విడివిడిగా ఉంటున్న వీరికి మంగళవారం విడాకులు మంజూరయ్యాయి. కొన్ని నెలల పాటు ప్రేమించుకున్న అమలాపాల్ – విజయ్‌లు గత 2014 జూన్ 12న పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉండాలన్న అత్తింటి వారి నిబంధనను అమలాపాల్ పాటించకపోవడంతో వారి మధ్య విభేదాలు తలెత్తాయి.
దీంతో ఆ జంట వివాహమైన కొంత కాలానికే విడిపోవాలని నిర్ణయించుకుని చెన్నై కోర్టును ఆశ్రయించారు. వారిద్దరికి కోర్టు కొంత సమయం కూడా ఇచ్చింది. అయితే, విజయ్‌తో కలిసి జీవించేది లేదని అమలాపాల్ తెగేసి చెప్పింది. జ్యూడీషియల్ సెపరేషన్‌లో భాగంగా గత ఆర్నెల్లుగా విడివిడిగా ఉంటున్న వీరికి మంగళవారం విడాకులు మంజూరయ్యాయి.
కాగా, వివాహ బంధానికి దూరమైన తర్వాత ఈ ఇద్దరూ తమ తమ కెరీర్‌లపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించారు. అమల చేతిలో ఇప్పటికే అరడజను ఆఫర్లు ఉండగా... విజయ్ కూడా రెండు సినిమాలకు దర్శకత్వం వహించేందుకు సమ్మతించాడు.
Post A Comment: