వన్ కల్యాణ్ నటించిన 'కాటమరాయుడు' చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబు కామియో రోల్ లో కనిపించనున్నాడని కొన్నాళ్ళుగా రూమర్స్ స్ప్రెడ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే వీటికి తాజాగా విడుదలైన టీజర్ చెక్ పెట్టిందని, మహేష్ నటించటం నిజమేననంటూ సోషల్ మీడియాలో కొందరు కామెంట్స్ పెడుతున్నారు.

కాటమరాయుడు టీజర్ లోని ఓ ఫైట్ సన్నివేశంలో విలన్ రైలు డోర్ పగలగొట్టుకొని మరీ ఫ్లాట్ ఫాం పైన పడిపోతాడు. అయితే ఆ విలన్ తో ఫైట్ చేసింది మహేష్ అని అంటున్నారు. నిజమో కాదో మీరూ ఓ సారి టీజర్ చూసి చెప్పండి.

వాస్తవానికి పవన్, మహేష్ మధ్య ఎప్పటి నుంచి మంచి రిలేషన్‌షిప్ కొనసాగుతోంది. గతంలో అర్జున్ సినిమా పైరసీ సమయంలో మహేష్‌కు పవన్ హెల్ప్ చేశారు. అలాగే త్రివిక్రమ్, పవన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన జల్సా సినిమాకు మహేష్ వాయిస్ ఓవర్ అందించారు. దాంతో ఈ రూమర్ అల్లేసి ప్రచారం చేస్తున్నారనే సందేహం కూడా చాలా మందిలో ఉంది.

మరి నిజంగానే టీజర్‌లో కనిపిస్తున్నది మహేష్ బాబా కాదా అన్నది తెలియాలంటే సినిమా విడుదలయ్యేదాక ఆగాలేమో!

Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: