Hindi Movie News | Latest Hindi Cinema News | Bollywood Film News | Bollywood News | All Cinema News | Cinerangam.com

సాహసోపేతమైన స్టంట్లు చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండే సల్మాన్‌ ఖాన్‌ ఈసారి సర్కస్‌ ఫీట్లతో ప్రేక్షకులను అలరించబోతున్నాడు. గుండ్రంగా తిరుగుతున్న గ్లోబులో బైక్‌ నడపడం, అడ్డుగా ఉన్న కార్ల మీదుగా బైక్‌ను గాల్లో లేపి దూకడం లాంటి సాహసాలు సర్కస్‌లో చూసే ఉంటారు. అలాంటి అబ్బురపరిచే మరెన్నో విన్యాసాలు ‘భారత్‌’ చిత్రం కోసం సల్మాన్‌ చేయబోతున్నాడు. సల్మాన్‌ ఖాన్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా, దిశా పటానీ కథానాయికలుగా నటిస్తున్నారు. ‘సుల్తాన్‌’ దర్శకుడు అలీ అబ్బాస్‌ జాఫర్‌ తెరకెక్కిస్తున్నారు.

భారతదేశంలో 1960వ శతాబ్దం నుంచి ఇప్పటివరకూ చోటు చేసుకున్న పరిణామాలను ప్రతిబింబించేలా ఈ చిత్రం రూపొందుతోంది. ఆరు దశాబ్దాల పాటు సాగే ఈ చిత్రంలో కాలానికనుగుణంగా సల్మాన్‌, ప్రియాంకలు ఐదు విభిన్నమైన లుక్స్‌తో కనిపించబోతున్నారట. అందులో భాగంగా 1960ల్లోని ఓ ఇండియన్‌-రష్యన్‌ సర్కస్‌ కంపెనీలో పనిచేసే స్టంట్‌ మోటర్‌ సైక్లిస్ట్‌గా కనిపించబోతున్నాడు సల్మాన్‌.

ఇదే కంపెనీలో తాళ్లతో వేలాడుతూ విన్యాసాలు చేసే కళాకారిణిగా దిశా నటిస్తోంది. ఇప్పటికే సల్మాన్‌, దిశా వారి పాత్రలకు సంబంధించి శిక్షణ తీసుకుంటున్నారు. ఈ చిత్రం కోసం ముంబయిలో ఓ సర్కస్‌ సెట్‌ కూడా రూపొందించారు. త్వరలోనే అక్కడ సల్మాన్‌, దిశా ఇంట్రడక్షన్‌లో భాగంగా వచ్చే స్టంట్‌ సన్నివేశాలపు చిత్రీకరించబోతున్నట్లు దర్శకుడు చెప్పాడు. అందుకోసం విదేశాల నుంచి సర్కస్‌ కళాకారులను రప్పించబోతున్నట్లు తెలిపారు. సల్మాన్‌, ప్రియాంకలపై ఓ హోలీ పాటను కూడా తెరకెక్కింబోతున్నారట.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: