ప్రముఖ నటి నమిత వివాహం ఈ రోజు (24 నవంబర్) ఉదయం తిరుపతిలోని ఇస్కాన్ ఆలయంలో ఘనంగా జరిగింది. తమిళ దర్శక నిర్మాత వీరేంద్ర చౌదరిని నమిత ప్రేమ వివాహం చేసుకున్నారు. గురువారం రోజున తిరుపతిలోని హోటల్ సింధూరి పార్క్‌లో మెహందీ కార్యక్రమం నిర్వహించారు. రెండేళ్లుగా తాను వీరేంద్రతో ప్రేమలో ఉన్నానని నవంబర్‌లో పెళ్లిచేసుకోబోతున్నానని నమిత గత నెలలోనే వీడియో మెసేజ్ ద్వారా ప్రకటించారు. నమిత వీరేంద్ర చౌదరి వివాహానికి రాధిక, శరత్‌కుమార్ దంపతులు, పలువురు తమిళ నటులు హాజరయ్యారు.
నమిత 2002లో ‘సొంతం’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత ‘ఒక రాజు ఒక రాణి’, ‘జెమిని’, ‘బిల్లా’ తదితర చిత్రాల్లో నటించారు. తమిళ చిత్ర పరిశ్రమలో కూడా ఆమెకు మంచి గుర్తింపు ఉంది. సెలబ్రిటీ రియాల్టీ షో తమిళ బిగ్‌బాస్ షోలోనూ నమిత పాల్గొన్నారు.
Post A Comment: