వెండితెరకు ‘అఖిల్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కథానాయిక సాయేషా సైగల్. కానీ ఆమెకి ఆదిలోనే పరాభవం ఎదురైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ‘అఖిల్’ ప్రేక్షకుల్ని అలరించడంలో విఫలమైంది. దాంతో సాయేషాకి అనుకొన్నంత మంచి అవకాశాలు లభించలేదు. కానీ తమిళం, హిందీ చిత్రసీమలు మాత్రం సాదరంగా స్వాగతం పలికాయి. జయం రవితో కలిసి ‘వనమగన్’లోనూ, అజయ్ దేవగణ్‌తో కలిసి ‘శివాయ్’లోనూ నటించింది. ఆ రెండు చిత్రాలూ విజయవంతమయ్యాయి. ఇప్పుడు తమిళ చిత్రసీమ నుంచి సాయేషాని మరిన్ని అవకాశాలు వరిస్తున్నాయి. అయితే ఆమె దృష్టి తెలుగు చిత్రసీమపైనే ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల హైదరాబాద్‌లో ఇల్లు కూడా కొనేసింది. సమంత ఇది వరకు నివసించిన ఖరీదైన ఓ ఇంటిని సాయేషా కొనుగోలు చేసినట్టు తెలిసింది.
హైదరాబాద్‌లో ఉంటూ తెలుగుతో పాటు, తమిళంలోనూ సినిమాలు చేయాలని సాయేషా ప్రణాళికలు రచించినట్టు, ఆ మేరకే ఇక్కడ ఇల్లు కొనుగోలు చేసినట్టు సమాచారం. హైదరాబాద్‌లో స్థిరనివాసం ఏర్పరుచుకొన్న కథానాయికల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. ఇప్పటికే రకుల్‌ప్రీత్ సింగ్, రాశిఖన్నాలాంటి స్టార్ భామలు ఇళ్లని కొనుగోలు చేసి మకాం మార్చేశారు. ఇప్పుడు ఆ జాబితాలోకి సాయేషా కూడా చేరినట్లైంది.
Post A Comment: