Telugu Movie News | Latest Telugu Cinema News | Tollywood Film News | Tollywood News | All Cinema News | Cinerangam.com

ర్శకుడు సుకుమార్ ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ‘రంగస్థలం -1985’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతోపాటే ‘దర్శకుడు’ అనే సినిమాని కూడా నిర్మిస్తున్నారాయన. ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఆగష్టు 4న రిలీజ్ చేయనున్నారు. దీంతో ప్రమోషనల్ కార్యక్రమాల్ని భారీగా చేపడుతున్నారు. అందులో భాగంగా ఈ చిత్రం యొక్క ఆడియో వేడుకకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను ముఖ్య అతిధిగా ఆహ్వానించారు. చరణ్ కూడా ఆహ్వానింది తన దర్శకుడే కాబట్టి ఆ చిన్న ఫేవర్ చేయడానికి ఒప్పుకున్నారు. ఈ కార్యక్రమం ఈ నెల 15న గచ్చిబౌలిలో జరగనుంది.

ఇంతకుముందు కూడా ఈ సినిమా యొక్క పాటల్ని సమంత, రకుల్ ప్రీత్ సింగ్ ల వంటి స్టార్ హీరోయిన్ల చేత లాంచ్ చేయించారు సుకుమార్. హరిప్రసాద్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో సుకుమార్ అసిస్టెంట్ అశోక్ కథానాయకుడి పాత్ర పోషించాడు.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: