యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘జై లవకుశ’. ఈ రోజు (ఏప్రిల్ 5, బుధవారం) శ్రీ రామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ చిత్ర మోషన్ పోస్టర్‌ను ఎన్టీఆర్ ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. పోస్టర్‌లో ‘జై రామ శ్రీరామ..’ అంటూ రాముడు, లక్ష్మణుడు, రావణాసురుడిని చూపించారు. ఈ చిత్రంలో జూనియర్ మొదటి సారి త్రిపాత్రాభినయం చెయ్యనున్నాడు. వాటిల్లో ఒకటి విలన్ పాత్ర కావడం విశేషం. అందుకే ఈ చిత్రానికి ‘జై లవ కుశ’ అనే మూడు పేర్లను కలిపి టైటిల్‌గా నిర్ణయించారేమో అని అంటున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పోషించే పాత్రల పేర్లు ‘జై.. లవ.. కుశ’ గా ఉండబోతున్నాయనే ఆసక్తి కర చర్చ జరుగుతోంది.
Wishing everyone a happy SRI RAMA NAVAMI.And here is the motion poster of #JaiLavakusa https://t.co/lq5O2u2hNb— Jr NTR (@tarak9999) April 5, 2017
Post A Comment: