ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ విద్యార్థుల సదస్సులో ప్రసంగించేందుకు అమెరికా వెళ్లిన జనసేన అధ్యక్షుడు, హీరో పవన్‌ కల్యాణ్‌ నషువాలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. తానెప్పుడూ నటుడ్ని కావాలనుకోలేదని, అసలు నటనంటేనే నచ్చదని  అన్నారు.  ‘చిన్నతనం నుంచి ఎప్పుడూ నటుడ్ని కావాలనుకోలేదు. అసలు నటనంటేనే నచ్చదు. సమాజంలో జరుగుతున్న పరిణామాల గురించి తెలుసుకోవాలని ఉండేది. రాజకీయాల్లోకి రావడం సాధారణంగానే ఉంది కానీ సినిమాల్లో హీరోయిన్లతో కలిసి డ్యాన్స్‌ చేయడం, డైలాగ్స్‌ చెప్పడం.. నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తాయి. ఏడు సినిమాలు చేసి రిటైర్‌ అవుదామనుకున్నా. ప్రజలకు చేరువగా ఉండటానికి దోహదపడే సినిమాలను నేను గౌరవిస్తాను. ఆ కారణంగానే సినిమాల్లో నటిస్తున్నా’ అని పవన్‌ సభలో అన్నారు.

పవన్ మాట్లాడిన మరి కొన్ని అంశాలు తెలుసుకోవాలంటే ఈ క్రింది వీడియో చూడండి.

స్పీచ్ మధ్యలో ఎర్ర టవల్ ని ధరించిన పవన్, ఈ టవల్ సామాన్యుడి కి గుర్తు అంటూ తెలిపాడు. తాను రాజకీయాలలోకి వద్దామని అనుకున్నప్పుడు చాలా బెదిరింపులు వచ్చాయని చెప్పిన పవన్, 'నేను ఏదైన చేసే ముందు ఒకసారి ఆలోచిస్తానే తప్ప దేనికి భయపడను.'అని చెప్పారు.

‘యూత్ అంటే రాజకీయ నాయకుల వారసులేనా? దేశంలో సామాన్య యువకులు లేరా? వాళ్లు రాజకీయాలకు పనికి రారా? యువత అంతా రాజకీయాల్లోకి రావాలి’ అని పవన్ వ్యాఖ్యానించారు. అదే సమయంలో సినిమాలకు సంబంధించి కూడా పవన్ చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లో తాను ఎప్పుడు సౌకర్యంగా ఫీల్ అవలేదని, రాజకీయాల్లోకి వచ్చి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న సమయంలోనే ఎక్కువ ఆనందాన్ని పొందానని అన్నారు.

సినిమాలకన్నా ప్రజాసమస్యలపై పోరాటమే తనకు సంతృప్తినిచ్చిందని పవన్ తెలిపారు. కుల రాజకీయాలు తనకు నచ్చవని, అన్యాయాన్ని చూస్తూ కూర్చోలేనని పవన్ అన్నారు. తనకు రాజకీయాలపై పూర్తి అవగాహన లేకపోయినా, సమాజాన్ని చదివే అలవాటుందని పవన్ కల్యాణ్ చెప్పారు.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: